హైదరాబాద్లో కరెంట్ షాక్ తో మరో ఇద్దరు మృతి

హైదరాబాద్ లో విద్యుదాఘాతానికి మరో ఇద్దరు బలి అయ్యారు. నగరంలోని పాతబస్తీ బండ్లగూడలో ఈ

విషాదం చోటు చేసుకుంది. గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ తీగలను కర్రతో పైకి లేపుతున్న క్రమంలో షాక్ తగిలి అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మరో వైపు అంబర్ పేట్ లో ఇదే తరహాలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఆదివారం రాత్రి రామంతాపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో కరెంట్ షాక్ తో ఐదుగురు మరణించారు. రెండు రోజుల వ్యవధిలో వరుస ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తుంది. వినాయకచవితి నేపథ్యంలో విగ్రహాలను తరలించే క్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.