
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని కుటుంబాలకు ఫ్యామిలీకార్డు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పథకాలు, కుటుంబసభ్యుల వివరాలతో ఫ్యామిలీ కార్డులు, పాపులేషన్ పాలసీ రూపొందించాలని ఆయన ఆదేశించారు. ఆధార్‌లా ఫ్యామిలీ కార్డును కూడా ఉపయోగించాలని చంద్రబాబు అన్నారు. దీంతో పాటు ఫ్యామిలీకి అందించే పథకాల వివరాలు కూడా కార్డులో ఉండాలని, కార్డులోని వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆయన అన్నారు. పథకాల కోసం కుటుంబాలు విడిపోవద్దు అని చంద్రబాబు అన్నారు. అందరికీ లబ్ది కలిగేలా అవసరమైతే పథకాలను రీ-డిజైన్ చేసే అంశాన్ని పరిశీలిద్దామని అధికారులకు సూచించారు.