
నటి నివేదా పెతురాజ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో తనకు కాబోయే భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. అతని పేరు రాజ్‌హిత్ ఇబ్రాన్. దుబాయ్ లో బిజినెస్ మ్యాన్. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగునున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
2016లో తమిళ సినిమాతో నివేదా పేతురాజు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ లో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘మెంటల్ మది’ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో బన్నీకి మరదలుగా నటించింది. ప్రస్తుతం ఆమె “పార్టీ” సినిమాలో నటిస్తున్నారు.