
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీ ఐపీఎస్ అధికారి సంజయ్ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. సంజయ్‌కు వచ్చే నెల 9 వరకు కోర్టు రిమాండ్ విధించింది. గతంలో ఏపీలో ఫైర్, సీఐడీ డీజీగా ఉన్న సమయంలో సంజయ్ అవకతవకలకు పాల్పడ్డారని గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. 4 వారాల్లోగా లొంగిపోవాలని సంజయ్‌కు గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. నేటితో సుప్రీంకోర్టు ఆదేశాలు ముగియడంతో ఏసీబీ కోర్టులో సంజయ్ లొంగిపోయారు. దీంతో ఏసీబీ కోర్టు సంజయ్‌కు రిమాండ్ విధించింది.