నాపై కక్షకట్టారు -కవిత

తెలంగాణ: బీఆర్ఎస్ లో చీలికలు మొదలైన సంగతి తెలిసిందే. ఇటీవల కవిత కేసీఆర్ కు రాసిన లేఖ బహిరంగం కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకురింది. అప్పటినుంచి బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు వచ్చేసిందని, సోంతంగా పార్టీ పెట్టబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తోడు తాజాగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా కవితను పదవి నుంచి తొలగించారు ఆమె సోదరుడు కేటీఆర్. కవిత స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నియమించారు. ఈ క్రమంలో కవిత స్పందించారు.

సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ కు శుభాకాంక్షలు తెలిపిన కవిత.. కార్మికుల చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారని ఆమె అన్నారు

ఈ ఎన్నిక రాజకీయ కారణాలతో జరిగింది. సింగరేణి కార్మికుల కోసం పోరాడుతున్న నాపై కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాల గురించి అందరికీ తెలుసు. నా తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖను నేను అమెరికా వెళ్లినప్పుడు లీక్ చేశారు. నాపై కుట్రలకు పాల్పడుతున్న వారిని బయటపెట్టాలని కోరితే.. నాపైనే కక్షకట్టారు. ఈ కుట్రదారులే నన్ను అనేక విధాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. నేను అమెరికాలో ఉన్నప్పుడే గౌరవ అధ్యక్ష ఎన్నిక జరిగింది. చట్టవిరుద్ధంగా టీబీజీకేఎస్ సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారని కవిత లేఖలో తెలిపారు.