
హైదరాబాద్ మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదురుగు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులు కర్ణాటకకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉండటం బాధాకరం