
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం తరువాత చిరంజీవి నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
ఈ క్రమంలో ‘విశ్వంభర’కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు చిరంజీవి. ఈ మూవీ ఆలస్యానికి గల కారణాన్ని వివరిస్తూ స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఈ సినిమాని అత్యుత్తమంగా అందించాలనే మా ప్రయత్నం. అందుకే ఈ మూవీ విడుదలకు కొంచెం టైమ్ తీసుకుంటున్నాం. ఈ సినిమా చందమామ కథలా సాగిపోతుంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేసేలా దీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. ఈ మూవీ 2026 సమ్మర్ లో ఎంజాయ్ చేయండి అంటూ ఫ్యాన్స్ కు హింట్ ఇచ్చారు చిరంజీవి.
ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. కునాల్ కపూర్ కీలక ప్రాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ మౌనిరాయ్ స్పెషల్ సాంగ్ లో మెరవనున్నారు. ఈ పాట మూవీకే హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈమూవీ ఫస్ట్ గ్లింప్స్ ఈరోజు ఆగస్టు 21 సాయంత్రం విడుదల చేయనున్నారు.