
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోం మంత్రి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. కృష్ణా పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆమె అన్నారు. అధికారులు కేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రమాదకర హోర్డింగులు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని హోంమంత్రి అనిత అన్నారు.