నేడు హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై విచారణ

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ రెండు పిటిషన్లను హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనున్నారు. ఈ పిటిషన్లలో 5 అంశాలు కీలకంగా ఉన్నాయి. వాటిలో కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలని, కమిషన్ నియమిస్తూ గత ఏడాది జీఓను కొట్టేయాలని తెలిపారు. తమకు కమిషన్ ఎలాంటి నివేదికను ఇవ్వలేదని పేర్కొన్నారు. కమిషన్ విచారణ సమయంలో యాక్ట్ సెక్షన్ 8బీ, 8సీ నోటీసులు అందలేదని తెలిపారు. కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పిటిషన్ లో రాసుకొచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. దీనికి కేసీఆర్ పూర్తి బాధ్యుడని తేల్చిచెప్పింది. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ.. కేసీఆర్, హరీష్ రావు రెండు పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ ప్రభుత్వం కమిషన్ వేసిందని హరీష్ రావు ఆరోపించారు.