
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటెర్డ్ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పేరును వెల్లడించింది కాంగ్రెస్. ఈ నెల 21న సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేస్తారని మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన లా చదివారు. 2007-11 మధ్య ఆయన సుప్రీం కోర్టు జడ్జిగా సేవలందించారు. సుదర్శన్ రెడ్డి గోవా లోకయుక్తగా పనిచేశారు.
కాగా ఇప్పటికే ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ను ప్రకటించింది. దీంతో సీపీ రాధాకృష్ణన్, జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ కొనసాగనుంది.