ఆరుగురు చిన్నారులను మింగేసిన కుంట

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. ఆస్పరి మండలం చిగలి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు గ్రామ శివారులోని కొండ ప్రాంతంలో ఉన్న కుంటలో ఈత వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలకు కుంటలో భారీగా నీరు చేరింది. ఈ క్రమంలో కుంటలో ఈతకు దిగిన విద్యార్థుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఓ విద్యార్ధి గ్రామస్తులకు తెలిపాడు. దీంతో చిగలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.