
న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ముఖ్య వ్యాఖ్యలు చేశారు. భారత్–చైనా
సంబంధాలు ప్రస్తుతం మెరుగుదల దిశగా సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయి, సహకారం పెరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, చైనా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు ఎరువులు, రేర్ ఎర్త్ మాగ్నెట్స్, టన్నెల్ బోరింగ్ మెషీన్ల ఎగుమతులపై ఇప్పటివరకు ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. ఈ చర్య భారత వ్యవసాయరంగానికి, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద ఉత్సాహం కలిగించనుంది.
నిపుణుల అంచనా ప్రకారం… ఈ నిర్ణయం ఇరుదేశాల ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, ద్వైపాక్షిక సహకారానికి కొత్త దారులు తీసుకువెళ్తుంది.