ఢిల్లీ: డ్రీమ్ 11 తో బీసీసీఐ ఒప్పందం రద్దు

ఢిల్లీ: భారత జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించిన డ్రీమ్ 11 తో బీసీసీఐ ఒప్పందం రద్దు చేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇటువంటి సంస్థలతో సంబంధాలు కొనసాగించబోమని బీసీసీఐ సెక్రటరీ అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటికే డ్రీమ్ 11 ప్రతినిధులు బీసీసీఐ కార్యాలయానికి వెళ్లి సంప్రదింపులు జరిపారు. కొత్త చట్టం కారణంగా తాముఏ ఈ ఒప్పందం కొనసాగించలేమని చెప్పినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయంశంగా మారింది.

దీంతో కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ వేట ప్రారంభించింది. రెండు పెద్ద సంస్థలు టీమ్ ఇండియాకు స్పాన్స్ కోసం ముందుకు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. వాటిలో టయోటా మోటార్ కార్పొరేషన్ ఒకటి, రెండోది ఒక ఫిన్‌టెక్ స్టార్టప్. ఇంకా అధికారిక టెండర్ ప్రాసెస్ మొదలు కాలేదు.