
నందమూరి బాలకృష్ణ ఆయన నట జీవితంలో 50 సంవత్సారాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఈక్రమంలో ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు. ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి నటుడు ఆయనే. ఈ సందర్భంగా ఈనెల 30న హైదరాబాద్ లో బాలకృష్ణను సత్కరించనున్నారు.
ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు, మూవీ సెలబ్రెటీలతో పాటు ఫ్యాన్స్ కూడా ఆయనకు అభినందనలు తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాలకృష్ణకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. నందమూరి తారక రామారావు వారసుడిగా బాలనటుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న నటుడు, ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఆయనెప్పుడూ ఇలాగే నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా అని పోస్టు చేశారు.