ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

విజయవాడ: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులను స్మార్ట్ గా మార్చేసింది. నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభమైంది. విజయవాడ వరలక్ష్మీ నగర్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశాం. వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం. రేషన్ తీసుకోగానే కేంద్ర, జిల్లా ఆఫీసులకు సమాచారం అందుతుంది అన్నారు. తొమ్మిది జిల్లాల్లో నేడు ఇంటింటికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం. 1.46 కోట్ల కుంటుంబాలకు సెప్టెంబర్ 15 కల్లా కార్డులు అందిస్తాం అని నాదెండ్ల మనోహర్ తెలిపారు