
నడక ఆరోగ్యానికి చాలా మంచిది. కాసేపు గడ్డిలో నడిస్తే ఒత్తిడితో పాటు పలు ఆరోగ్య సమస్యలు దూరమౌతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు పని అలసటతో బాగా ఒత్తిడికి గురైనప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోకుండా.. కాసేపు గడ్డిలో నడిస్తే అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
చెప్పులు లేకుండా గడ్డి మీద నడవడాన్ని ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ అని అంటారు. ఎంత పని ఉన్నా సరే.. రోజులో ఓ పదినిమిషాలు గడ్డిలో నడిస్తే ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తుందని, నేలపై ఉండే ఎలక్ట్రాన్లు నిద్రలేమిని తగ్గించడమే కాకుండా ఆరోగ్యకరమైన నిద్రకూ సహాయ పడతాయట. ఒంట్లోని వాపుని తగ్గించి వ్యాధినిరోధశక్తిని పెంచుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.