
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో అమెరికా విధించిన అదనపు సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు అమెరికా అధికారికంగా నోటీసులు పంపింది. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై అదనపు సుంకాలు వర్తిస్తాయని ట్రంప్ సర్కారు నోటీసు విడుదల చేసింది. కొత్త సుంకాలు అమెరికా కాలమానం ప్రకారం ఆగస్ట్ 27 అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నోటీసుల్లో పేర్కొంది. ఆ సమయం తర్వాత అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు కొత్త టారిఫ్‌లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. భారత కాలమానం ప్రకారం ఆగస్ట్ 27 ఉదయం 10 గంటల నుంచే అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి.