
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మెగా 157 మూవీ టైటిల్ ను విడుదలచేశారు మేకర్స్. చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘పండగకి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ వీడియోలో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ గ్లింప్స్ కు విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్ర్కీన్ బ్యానర్, సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు.