
అమరావతి: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణంలో కీలక నిందితుడు, ఏ1 గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. రూ. 13 కోట్లతో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తుల్లో కొన్ని ఆయన బంధువుల పేర్లపై కూడా కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ ఆస్తులను జప్తు చేసేందుకు కొత్త రూల్స్ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.