సహస్ర హత్యకేసులో వీడిన మిస్టరీ.. నిందితుడు అరెస్ట్

హైదరాబాద్ కూకట్‌పల్లిలో సంచలనం రేపిన బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. 12 ఏళ్ల బాలికను హత్య చేసిన నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సహస్ర ఇంటి పక్కన భవనంలో నివాసముంటున్న పదవ తరగతి విద్యార్థి ఈ హత్య చేసినట్లు తేలింది.

దొంగతనం కోసం వెళ్లిన బాలుడు ఆసమయంలో ఇంట్లో ఉన్న సహస్రను చూసి భయపడి ఆమెను హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. సహస్రను ఒక స్యూల్ విద్యార్థి హత్య చేశాడని తెలియడంతో స్ధానికులు షాక్ అవుతున్నారు.