ది ప్యారడైజ్‌లో ఆ పాత్రలో కీర్తి సురేష్

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ కాంబినేషన్ అంటే అభిమానులకు పండగే. ఈ జోడీ గతంలో నేను లోకల్, దసరా సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడు ఈ హిట్ జంట మూడోసారి కలిసి నటించేందుకు సిద్ధం అవుతున్నారు.

నాని-కీర్తి సురేష్ జంటగా తొలిసారి 2017లో వచ్చిన నేను లోకల్ సినిమాతో రొమాంటిక్ కామెడీ జోనర్‌లో సంచలన విజయం సాధించింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత 2023లో వీరిద్దరూ ‘దసరా’లో తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించి మరోసారి సత్తా చాటారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 100 కోట్ల క్లబ్‌లో చేరి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నాని క్రేజ్ మాస్ ఆడియన్స్‌లో రెట్టింపు కాగా, కీర్తి సురేష్‌కు వెన్నెల పాత్ర కెరీర్‌లో గుర్తుండిపోయే సక్సెస్ అందించింది.

ఇటివల కీర్తి సురేష్ చేసిన ‘భోళా శంకర్’, ‘ఉప్పుకప్పురంబు’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ నానితో ఆమె కాంబినేషన్ మాత్రం రెండుసార్లూ బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో, అభిమానులు ఈ హిట్ జోడీ హ్యాట్రిక్ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మాస్ ఆడియన్స్‌ను అలరించాడు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, ఎస్‌జే సూర్య విలన్‌గా మెప్పించారు. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఈ సినిమా తర్వాత నాని ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనే క్లారిటీ లేదు.

మరోవైపు కీర్తి సురేష్ తెలుగు, హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. తమిళంలో రివాల్వర్ రీటా, ‘కన్నైవెడి’ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు రఘుతాత తర్వాత మరో ఉమెన్ సెంట్రిక్ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. అయితే తెలుగులో ఆమెకు కోలీవుడ్ కంటే మంచి మార్కెట్ ఉన్నప్పటికీ…తమిళంలో ఎక్కువ అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల విడుదలైన ‘ఉప్పుకప్పురంబు’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ‘ది ప్యారడైజ్’ లో హీరోయిన్‌గా కిర్తీని తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన మేకర్స్ కి ఉన్నట్లు తెలుస్తోంది. దసరా సినిమాలో ఎలాగో మెప్పించింది. ఈ సినిమాలో కూడా మాస్ పాత్రలో కీర్తి సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. చూడాలి మరి మేకర్స్ ఎలాంటి అలోచన చేస్తారో…!