పూనకాలు లోడింగ్ : చిరు, బాలయ్య సినిమాలో వెంకటేష్

సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో 300 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టించిన వెంకీ…ఆరు నెలల గ్యాప్ తర్వాత తన కొత్త సినిమాల అప్డేట్స్ ఇచ్చారు. యూఎస్‌లో జరిగిన నాట్స్ 2025 వేడుకల్లో వెంకటేష్ తన తదుపరి ప్రాజెక్ట్స్ పూర్తి వివరాలను వెల్లడించారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న విడుదలై 300 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన కామెడీ-యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి అద్భుత నటనతో మెప్పించారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత, వెంకటేష్ ఆరు నెలలు సినిమా ప్రకటనలు లేకుండా నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ నాట్స్ 2025లో ఆయన ఒక్కసారిగా ఐదు క్రేజీ ప్రాజెక్టులను ప్రకటించి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు.

మొదటగా, వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవితో మెగా 157లో కీలక క్యామియో పాత్రలో కనిపించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
ఇక, అందరూ ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కొత్త చిత్రం ఆగస్టు 2025 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. త్రిష, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రం 2026 వేసవికి విడుదల కానుందని తెలుస్తోంది.

అనిల్ రావిపూడితో మరోసారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’ 2027 సంక్రాంతికి రానుంది. మరోవైపు ‘దృశ్యం 3’తో వెంకటేష్ తిరిగి రాంబాబుగా కనిపించనున్నారు. మీనాతో కలిసి ఈ థ్రిల్లర్ సీక్వెల్ తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి షూట్ కానుంది. షూటింగ్ ఆగస్టు 2025లో ప్రారంభమై, 2026లో విడుదల కానుందని తెలుస్తోంది.
చివరగా, నందమూరి బాలకృష్ణతో మల్టీస్టారర్ చిత్రం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లో మొదటిసారి సీనియర్ హీరోతో స్క్రీన్ షేర్ షేర్ చేసుకొనున్నారు. వెంకటేష్ ఈ ఐదు ప్రాజెక్టులతో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు సిద్ధమవుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి లెజెండ్స్‌తో షేర్ చేసుకొగా..త్రివిక్రమ్, అనిల్ రావిపూడి లాంటి దర్శకులతో వెంకీ మామ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్నారు. మొదటగా ‘మెగా 157’తో 2026 సంక్రాంతి పండగకు అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నారు.