జియో మరో బాంబ్ వేసింది! ఇంటర్నెట్ రంగంలో భారీ సర్‌ప్రైజ్

రిలయన్స్ జియో తాజాగా ప్రముఖ బ్రాడ్‌బాండ్ సంస్థ నెట్‌ప్లస్ ను కొనుగోలు చేయబోతున్నట్లు సమాచారం. దీనితో జియో తన ఫైబర్ బిజినెస్‌ను పంజాబ్, హర్యానా, ఉత్తరాది రాష్ట్రాల్లో మరింత విస్తరించనుంది. ఇప్పటికే అటు టెలికాం, ఇటు OTT రంగాల్లో రాజ్యం చేస్తున్న జియో ఇప్పుడు ఇంటర్నెట్ సేవల్లో మరింత కంట్రోల్ సాధించనుంది. ఈ డీల్ ముగిసిన తర్వాత, నెట్‌ప్లస్ కస్టమర్లందరికీ జియో ప్లాన్‌లు వర్తించనున్నాయి. ఇది మధ్యతరగతి ఇంటర్నెట్ వినియోగదారులకు మంచి అవకాశం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.