బంగారం పెరిగిపోతోంది! పెళ్లిళ్లు ఉన్నవాళ్లకి బిగ్ టెన్షన్

గత వారం రోజుల్లో బంగారం ధర ఔటర్ కంట్రోల్‌కు వెళ్లిపోయింది. ఒక్కసారిగా 10 గ్రాముల ధర రూ.65,500 దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌కి డిమాండ్ పెరగడం, డాలర్ వ్యాల్యూలో మార్పులు ఇలా అనేక కారణాల వల్ల ధరల పెరుగుదల నమోదైంది. దీనివల్ల పెళ్లిళ్లు ఉన్న కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. “ఇప్పుడు కొంటే భారం… ఎదురు చూసినా భయం” అనే స్థితి ఉంది. నిపుణులు మాత్రం వచ్చే నెలలో కొంత తగ్గవచ్చని ఆశ చూపుతున్నారు. కానీ పెళ్లిళ్ల సీజన్ లో ఇది తాత్కాలిక ఊరట మాత్రమే అంటున్నారు.