
ఇటీవల ఫేక్ లోన్ యాప్‌లు మళ్లీ చాపకింద నీరులా పెరుగుతుండడంతో, రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుండి పర్సనల్ లోన్ ఇస్తున్న ప్రతి NBFC లేదా బ్యాంక్, దాని వెబ్‌సైట్‌లో ‘లెండర్ కేబినెట్ ID’ ఉంచాల్సిందేనని RBI ఆదేశించింది. ఇది నకిలీ యాప్‌లు ద్వారా మోసపోతున్న పేద ప్రజలకు ఉపశమనం కలిగించనుంది. ఇప్పటికే వేలాది మందికి తమ ఫోన్ గ్యాలరీ, కాంటాక్ట్స్ లీక్ కావడంతో వారు మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. RBI తాజా నిర్ణయం వల్ల ప్రజలు లోన్ తీసుకునే ముందు సంస్థను గుర్తించగలిగే అవకాశముంది. ఇది డిజిటల్ భద్రతలో పెద్ద అడుగు అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.