
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారు. దానిలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో భేటీ అయిన ఆయన ఏపీలో యువతకు సాఫ్ట్ స్కీల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర ఓడలు, ఓడరేవులు, జల రావాణా మంత్రి సర్బానందాను కలిశారు.