చిరంజీవి- అనిల్ మూవీ టైటిల్ అదేనా?

సెకండ్ ఇన్నింగ్స్ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా చేస్తుంది. ప్రస్తుతం ఈమూవీ #MEGA157 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. ఈనెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ను ప్రకటించనున్నారు మేకర్స్. దీంతో ఈ సినిమా టైటిల్ గురించి చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ మూవీకి 3 టైటిల్స్ ను పరీశీలిస్తున్నట్లు చిత్రబృందం ఇటీవలే ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించింది. వాటిలో “మన శివ శంకర వరప్రసాద్ గారు” అనే టైటిల్ దాదాపు ఫిక్స్ అయినట్లు టాక్. ఈ సినిమాలో చిరంజీవి డ్రిల్ మాస్టర్ పాత్రలో నటించబోతున్నారని, ఆ పాత్ర పేరు శివ శంకర వరప్రసాద్ అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి మరోసారి వింటేజ్ లుక్ లో కనిపించనున్నట్లు వార్తలు రావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.