
“డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ను తమిళ సినిమాకి మరో రాజమౌళి అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన తీసిన ప్రతి సినిమా కొత్తయాక్షన్‌తో ట్విస్టుల తో సినిమా లవర్స్‌కి పండగలా మారింది. LCU అనే కొత్త యూనివర్స్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్‌ని సంపాదించారు. కానీ… తాజాగా వచ్చిన ‘కూలీ’ సినిమా మాత్రం ప్రేక్షకులను గోరంగా నిరాశపరిచింది. ఎందుకు ఫెయిల్ అయ్యింది? చూద్దాం.
రజనీకాంత్, నాగార్జునతో పాటు పలువురు స్టార్స్ నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్స్‌కి వచ్చింది. కానీ జనాలు మాత్రం సినిమాకంటే ఎక్కువగా “ఇది LCU లో భాగమా?” కాదా ? అని ఎదురు చూసారు . సోషల్ మీడియాలో ఊహాగానాలు పెంచేయడంతో, థియేటర్‌లో కూడా ప్రేక్షకులు కథ కంటే కనెక్షన్ల కోసం ఎదురు చూశారు. చివరికి LCU లో భాగం కాదు అని తెలిసిన వెంటనే మరింత నిరాశ చెందారు. సినిమా లో లోపాలు లేవా అంటే వున్నాయి , కానీ మరి ఇలా డిసాస్టర్ సినిమా కాదు ఏ ఎక్సపెక్టషన్స్ లేకుండా థియేటర్ కి పోతే , స్యూర్ షాట్ ఒక సారి హాల్ లో చూసే సినిమానే మరో సమస్య.
ఈ సినిమా 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందన్న హైప్. ఐదుగురు పెద్ద స్టార్స్ ఉన్నారని, ఈ సినిమా తో పక్క 1000క్రోర్స్ కొట్టబోతున్నాం అని అభిమానులు ఓవర్‌గా ప్రమోట్ చేయడంతో ఎక్కడ లేని అంచనాలు ఏర్పడ్డాయి. అందుకె ఆ హైప్‌ని సినిమా నిలబెట్టలేకపోయింది. మొత్తానికి, అంచనాలు, హైప్, LCU కనెక్షన్ల గోలే ‘కూలీ’ ఫెయిల్యూర్‌కు కారణం అని చెప్పొచ్చు.”