
విజయవాడః వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ దగ్గర సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు లోపలకురాకుండా అడ్డుకొనేందుకు భారీగా పోలీసుల మోహరించారు. అంతకుముందు విద్యార్థులు యూనివర్సిటీకి ర్యాలీగా విద్యార్థులు బయల్దేరి అక్కడకు చేరుకొన్నారు. ధర్నా కార్యక్రమంలో
మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను తక్షణం నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అలాగే విదేశీ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని కూడా విద్యార్థులు డిమాండ్ చేశారు.