ఢిల్లీకి అచ్చెన్నాయుడు

అమరావతిః ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం నుంచి రెండు రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. సోమ, మంగళవారాలలో ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో అచ్చెన్నాయుడు భేటీ కానున్నట్టు సమాచారం. ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా జూలై 7వ తేదీ సోమవారం ఉదయం కేంద్ర వ్యవసాయ,  రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో మంత్రి

అచ్చెన్నాయుడు  సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న పలు కీలక అంశాలపై కేంద్రమంత్రితో చర్చించనున్నారు. అనంతరం కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్), రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లను మంత్రి అచ్చెన్నాయుడు కలవనున్నట్టు అధికారులు తెలిపారు.