క్వాంటమ్‌ వ్యాలీకి  గ్రీన్‌ సిగ్నల్‌!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో చేపట్టనున్న క్వాoటo వ్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. క్వాంటమ్‌ వ్యాలీ డిక్లరేషన్‌ను ఆమోదిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గత నెల 30న క్వాoట వ్యాలీపై సాఫ్‌వేర్‌ రంగ నిపుణులతో ప్రభుత్వ ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించిన విషయం విదితమే. రాష్ట్రంలో అమరావతి క్వాoటం వ్యాలీ ఏర్పాటుకు సంబంధించి  సంవత్సరాల వారీగా క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

అలాగే.. 2026 నుంచి 2029 వరకు షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1న రెండు ఐబీఎం క్వాoటo సిస్టమ్స్ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ క్వాంటమ్‌ వ్యాలీలోని భాగస్వామ్య కంపెనీలకు, స్టార్టప్, గ్లోబల్ పార్టనర్స్ డిక్లరేషన్ ప్రకారం ముందుకు వచ్చి అమరావతి క్వాoటo వ్యాలీలో భాగస్వామ్యం కావాలంటూ ప్రభుత్వం ఆహ్వానించింది.