
హైదరాబాద్: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ కృపానందాన్ని నిర్దోషులుగా తేల్చుతూ నాంపల్లి సీబీఐ కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈక్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సబితా ఇంద్రారెడ్డి, కృపానందాన్ని ఆదేశిస్తూ.. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.