
హైదరాబాద్: కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. రామంతాపూర్ లోని గోకులేనగర్‌లో కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం నిర్వహించిన రథోత్సవంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రథానికి కరెంట్ వైర్లు తగిలి ఆరుగురు మృతి చెందారు. రథాన్ని లాగుతున్న వాహనం మొరాయించడంతో అక్కడ ఉన్న భక్తులు రథాన్ని చేతులతో లాగేందుకు ముందుకు వచ్చారు.
ఈక్రమంలో రథానికి కరెంట్ వైర్లు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ తగిలి తలో వైపు ఎగిరిపడ్డారు. ఈఘటనతో షాక్ కు గురైన స్థానికులు తేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్ మెన్ కూడా ఉన్నట్లు సమాచారం