ప్రిక్వార్టర్స్ లో సింధు విజయం

పారిస్: ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు అదరగొడుతోంది. గత కొన్ని టోర్నీల్లో ఇబ్బందిపడిన సింధు ప్రతిష్ఠాత్మక టోర్నీ లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో సింధు 21-19, 21-15 తో ప్రపంచ రెండో ర్యాంకు షటర్లర్ వాంగ్ జియు (చైనా)పై విజయం సాధించింది. 48 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో వరుస గేమ్‌ల్లో సింధు ప్రత్యర్థి ఆటకట్టించింది. వాంగ్ పై గెలుపోటముల రికార్డును 3-2తో మెరుగు పరుకుంది. క్వార్టర్స్ లో పుత్రి కుసుమవర్దని (ఇండోనేసియా) తో సింధు తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో రికార్డు స్థాయిలో ఆరో పతకం సింధు సొంతమవుతుంది.