
తెలంగాణలో సంచలనం రేపిన కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలిక ఇంటికి సమీపంలో ఉన్న బాలుడే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు వివరాలను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మీడియాకు వెల్లడించారు
క్రికెట్ బ్యాట్ చోరీ కోసం వెళ్లిన సమయంలో బాలికను చంపేసినట్లు పేర్కొన్నారు. విచారణలో బాలుడు తప్పుదారి పట్టించాడు. బాలిక అరుపులు వినిపించాయని అన్నాడు, కానీ అందులో వాస్తవం లేదు. బాలుడికి బ్యాట్ నచ్చడంతో దానిని చోరీ చేసేందుకు సహస్ర ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న బాలిక అతడిని అడ్డుకోవడంతో ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నాం.
నిందితుడు స్కూల్ కి సరిగా వెళ్లేవాడు కాదు. ఓటీటీలో క్రైమ్ సినిమాలు, మిస్టరీ సీన్లు చూడటం. యూట్యూబ్ లో క్రైమ్ ధ్రిల్లర్ సినిమాలు చూడ్డాం అలవాటు చేసుకున్నాడని తెలిపారు. హత్య గురించి అతడి తల్లిని విచారిస్తే తనకు తెలియదని చెప్పిందని సీపీ అవినాష్ మహంతి అన్నారు.
కాగా బాలిక సహస్ర తల్లిదండ్రులు, కుటంబసభ్యులు తమకు న్యాయం చేయాలంటూ కూకట్పల్లి పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. నిందితుడిని తమ ముందుకు తీసురావాలంటూ డిమాండ్ చేశారు. సహస్ర హత్యవెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని వారు ఆరోపించారు. బ్యాట్ కోసం ఇంత దారుణం చేస్తారా అని సహస్ర తల్లి అంటున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అతడిని ఎన్ కౌంటర్ చేయాలని నినాదాలు చేశారు.