అల్లు అర్జున్- అట్లీ మూవీకి హాలీవుడ్ టచ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తేలిసిందే. ఈసినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. దీంతో ఈ సినిమా అంతర్జాతీయ మార్కెట్ దృష్టిని కూడా ఆకర్షిస్తోంది.

ఈ మూవీని “AA22xA6” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ ఇవ్వాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం హాలీవుడ్‌లోని ఒక ప్రముఖ స్టూడియో, సన్ పిక్చర్స్ సంయుక్తంగా కలిసి ఈ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

పునర్జన్మల కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షనల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటించనున్నట్లు టాక్. దీపికా పదుకొణే మెయిన్ హీరోయిన్‌ గా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, రష్మిక మందనా, జాన్వీ కపూర్, కృతి సనన్ కూడా మెరవనున్నారు. కాగా సీనియర్ నటి రమ్యకృష్ణ, విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.