పూరీ జగన్నాథ్‌, విజయ్‌ సేతుపతి మూవీ టైటిల్ లీక్

విజయ్‌ సేతుపతి హీరోగా c దర్శకత్వంలో సినిమా ప్రకటించిన నాటి నుంచి ఫిల్మ్‌ వర్గాల్లో ఈ సినిమా ఓ ఆసక్తికరమైన టాపిక్‌గా నిలిచింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్‌ మొదలవుతుందా అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు హైదరాబాద్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది. విజయ్‌ సేతుపతి, సంయుక్త మీనన్‌, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను భారీ సెట్‌లో పూరీ చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్స్‌ లేకుండా శరవేగంగా షూటింగ్‌ సాగుతుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సినిమాకు ‘భవతీ భిక్షాందేహీ’ అనే టైటిల్‌ ప్రస్తుతం ప్రచారంలో ఉంది.