వార్ 2 కీలక అప్ డేట్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం

‘వార్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించి తన పాత్ర చిత్రీకరణ పూర్తయినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా తన సహనటుడు హృతిక్ రోషన్ పై, చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ప్రయాణం తనకు ఎన్నో విషయాలు నేర్పిందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. సెట్ లో హృతిక్ రోషన్ సర్ తో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభూతి. ఆయన ఎనర్జీని నేను ఎప్పుడూ ఆరాధిస్తాను. ఈ సినిమా ప్రయాణంలో ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు.