
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ
గేయ రచయిత, స్క్రీన్ రైటర్ శివశక్తి దత్త కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలోఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శివశక్తి దత్త కేవలం కీరవాణి తండ్రిగానే కాకుండా, తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా తనదైన ముద్ర వేశారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, చత్రపతి, సై, రాజన్న, హనుమాన్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలకు ఆయన అద్భుతమైన పాటలు రాశారు. అంతేకాకుండా కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటర్‌గా కూడా ఆయన సేవలు అందించారు.