కోహ్లీ లైక్‌పై ఎట్టకేలకు స్పందించిన అవ్‌నీత్‌కౌర్

ట్రెండింగ్ బ్యూటీ అవ్‌నీత్ కౌర్ బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో పాటు అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ ఫోజులతో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే ఆమె లైఫ్ ఇంతలా టర్న్ అవ్వడానికి విరాట్ కోహ్లి కారణం. అవ్‌నీత్ ఫొటోను విరాట్ కోహ్లీ లైక్ చేసిన తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. తన ఇన్‌స్టాలో మిలియన్లలో ఫాలోవర్స్ పెరిగారు. దీనిపై గతంలోనే కోహ్లీ క్లారిటీ ఇచ్చారు. పొరపాటున లైక్ బటన్ ప్రెస్ అయిందని దీని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని గతంలోనే స్పష్టత నిచ్చారు. దయచేసి అనవసర ఊహగానాలు సృష్టించొద్దని అన్నారు.

అవ్‌నీత్ కౌర్ తాజా చిత్రం లవ్ ఇన్ వియత్నాం మూవీ ప్రచారంలో కొన్ని విషయాలు వెల్లడించింది. నెటిజన్లే కాకుండా అగ్ర నటీనటులు కూడా తనపై ప్రేమాభిమానాలు చూపుతున్నారని అంటూనే కోహ్లీ లైక్‌పై పరోక్షంగా స్పందించింది. నవ్వుతూ ప్రేమ దొరుకుతూనే ఉండాలి నేను ఇంతకు మించి చెప్పలేను అంది.