కోరుకొండలో తెలుగు తమ్ముళ్ల వీరంగం!

తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మునగాల సమీపంలో రెండు వర్గాలకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు బాహాబాహీకి తలపడ్డారు. రెండు వర్గీయుల కార్యకర్తలు దాడులకు దిగారు. వారి మధ్య తోపులాట జరగటంతో స్థానికులు ఆందోళన చెందారు.

ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుర్తి అభిరామ్, స్థానిక శాసనసభ్యులు, ఎంపీల కాన్వాయ్‌ వ్యవహారంలో వివాదం తలెత్తింది. పెందుర్తి వర్గీయులు, బొడ్డు వర్గీలు మధ్య మాటల యుద్ధం చోటుచేసుకొంది. పెందుర్తి అభిరామ్ కారుకి మరో వ్యక్తి కారు అడ్డుపెట్టడంతో చెలరేగిన వివాదం ఘర్షణగా మారింది. ఇరువర్గాల తోపులాటలో కొందరు కిందపడ్డారు.

రుడా చైర్మన్ వెంకటరమణ చౌదరి మధ్య కాన్వాయ్‌లో ముందు మేమెళ్లాలి అంటే మేమే వెళ్లాలి అంటూ జరిగిన వివాదం ఘర్షణకు దారితీసింది.తెలుగుదేశం వర్గీయులు ఘర్షణకు దిగడంతో స్థానికులు ఆందోళనచెందారు.