కర్నూలు హత్యకు కారణం ఇదే!

కర్నూలు: కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లె హత్య కేసును పోలీసులు చేధించారు. ఈనెల ఒకటో తేదీన శేషన్న అనే వ్యక్తి  కాలు నరికి అదే గ్రామంలో నిందితులు ఊరేగింపు నిర్వహించారు. ఒక మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో నిందితులు శేషన్న హత్యకు కుట్రపన్నారు.హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

వీరివద్ద నుంచి మూడు వేట కొడవళ్లు, ఒక బైకును పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.