తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వర్షాలు

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. పంటలు నీట మునిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అటు ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేసుకున్నాయి. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తుండటంతో నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. దీంతో ఆయా జిల్లాల యంత్రాగం అప్రమత్తమైంది. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మత్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.