
అమరావతి: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో దారుణం జరిగింది. బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలను లారీ ఢీ కొట్టడంతో భార్య మృతి చెందగా.. భర్త తీవ్రగాయాల పాలైయ్యాడు. జొన్నవారిగూడెం ఘగర్ ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారి పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద పడి నుజ్జునుజ్జయిన మహిళ మృత దేహాన్ని లారీ కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.