
రామాయణం… భారతీయ సంస్కృతిలో ఓ అమర గాథ. 1987లో రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం సీరియల్‌లో రాముడిగా మనసులు గెలిచిన అరుణ్ గోవిల్…ఇప్పుడు నితేశ్ తివారీ రామాయణం సినిమాలో దశరథుడిగా కనిపించనున్నారు. కానీ రాముడిగా చెరగని ముద్ర వేసిన అరుణ్‌ను దశరథుడిగా ప్రేక్షకులు అంగీకరిస్తారా..?
రామానంద్ సాగర్ రామాయణం సీరియల్ 1987-88లో ప్రసారమై, దేశవ్యాప్తంగా సాంస్కృతిక విప్లవం సృష్టించింది. అరుణ్ గోవిల్ రాముడిగా, దీపికా చిఖ్లియా సీతగా నటించి మిలియన్ల మనసుల్లో నిలిచారు. అరుణ్ రాముడి పాత్ర అంతగా ఆరాధించారు. ఆయన్ను ఎక్కడ చూసినా భక్తులు పూజలు చేసేవారు. ఇప్పుడు నితేశ్ తివారీ రూపొందిస్తున్న రామాయణం సినిమాలో అరుణ్ గోవిల్ రాజా దశరథుడిగా కనిపించనున్నారు.
ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా 2026, 2027 దీవాళీ సందర్భంగా రెండు భాగాలుగా విడుదల కానుంది. అయితే అరుణ్ గోవిల్ దశరథుడిగా నటించడంపై సీత పాత్రధారి దీపికా చిఖ్లియా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అరుణ్‌ను రాముడిగా, తనను సీతగా చూశారు. ఆయన్ను దశరథుడిగా చూడటం కాస్త అసందర్భంగా అనిపిస్తోందని తెలిపారు.
రాముడు పోషించిన వ్యక్తి రాముడిగానే ఉంటాడని అన్నారు. దీపికా ఈ సినిమా కోసం తనను సంప్రదించలేదని, సీత తప్ప మరే పాత్రలోనూ నటించలేనని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అరుణ్ గోవిల్ రాముడిగానే మనసులో ఉన్నారు, దశరథుడిగా చూడటం కష్టమని అంటున్నారు.
మరోవైపు, కొందరు అభిమానులు ఈ కాస్టింగ్‌ను స్వాగతిస్తున్నారు. అరుణ్ గోవిల్ రామాయణ విశ్వంలో భాగమవడం భావోద్వేగంగా ఉందని చాలా మంది అభిమానులు అంటున్నారు. మరోవైపు ‘రామాయణ’కు సంబంధించిన మరో వార్త కూడా వైరల్‌గా మారింది. ‘హర హర మహాదేవ’ సీరియల్‌తో శివుడిగా ఆకట్టుకున్న మోహిత్ రైనా ఇందులోను శివుడిగా కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. సుమారు 1600 కోట్లతో బడ్జెట్‌తో ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది.