రాముడి పాత్రకు రూ.150 కోట్లు

భారతీయ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం రామాయణ. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో రాముడి పాత్ర పోషిస్తున్న రణ్‌బీర్ కపూర్ ఏకంగా 150 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా కోసం ఒక్కో భాగానికి ఆయన 75 కోట్లు చొప్పున ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులో సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవికి కూడా రూ.12 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. నటీనటుల రెమ్యునరేషన్లతో పాటు సినిమా బడ్జెట్ కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.