
యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో మంచు మనోజ్ విలన్గా కనిపించనున్నాడు. సీనియర్ నటి శ్రియ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లు ఏస్ధాయిలో ఉండనున్నాయో దీనిలో చూపారు. దునియాలో ఏదీ నీది కాదు, నా గతం నక్షత్రం.. నా ప్రస్తుతం ఊహాతీతం అంటూ మనోజ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.