రాయచోటి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

రాయచోటిః అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు.. రాయచోటి మదనపల్లి మార్గంలోని, ఇస్తిమా మైదానానికి సమీపాన ఉన్న శ్రీనివాసపురం వద్ద లారీ, ఇన్నోవా వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.